సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(KGBV) 2024-25 సంవత్సరంకు 729 ఉద్యోగాలకు నోటిఫికేషన్
AP KGBV Notification 2024 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(KGBV) 2024-25 సంవత్సరంకు 729 ఉద్యోగాలకు నోటిఫికేషన్,ఈ రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, దరఖాస్తు నమోదుకు చివరి తేదీ ఈనెల 15. ఉద్యోగనియామకాల్లో ఎలాంటి రాతపరీక్ష లేదు. అర్హులైన అభ్యర్ధులు అక్టోబరు 7 నుంచి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.AP KGBV Notification.
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV) ల్లో 2024-25 విద్యా సంవత్సరం (ఏడాది) కాలానికి ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.
అర్హులైన అభ్యర్ధులు అక్టోబరు 7 నుంచి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఆసక్తిగల అభ్యర్థులు నింపిన దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.
మొత్తం పోస్టుల్లో రాష్ట్రవ్యాప్తం గా ఉన్న టైప్-3 కేజీబీవీల్లో 547 పోస్టులు, టైప్-4లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు.
టైప్-3లో హెడ్ కుక్ పోస్టులు 48 మరియు అసిస్టెంట్ కుక్ పోస్టులు 263
వాచ్ ఉమెన్ పోస్టులు 95,
స్కావెంజర్ పోస్టులు 79, స్వీపర్ పోస్టులు 62 వరకు ఉన్నాయి సమాచారం .
టైప్ 4లో హెడ్‌కుక్ పోస్టులు 48 మరియు అసిస్టెంట్ కుక్ పోస్టులు 76, చౌకీదార్ 58 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులన్నింటినీ తాజా నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు.
ఆయా మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను ఈ నెల 17న జిల్లా కార్యాలయాల కు పంపిస్తారు.
ఇటీవల 604 బోధనా, బోధనేతర సిబ్బందిని ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే.
AP KGBV Notification Direct links
- Official Website: apkgbv.apcfss.in





