TGPSC Group-III పరీక్షా తేదీ ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 17 మరియు 18 తేదిల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం

TGPSC Group-III Exam Dates Notification

TGPSC Group-III Exam Dates Notification Released Telangana Public Service Commission TGPSC 2024 

TGPSC Group-III  తెలంగాణ గ్రూప్‌-3 అభ్యర్థులకు బిగ్‌ అప్‌డేట్‌ పరీక్షా తేదీ ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 17 మరియు 18 తేదిల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం. సబ్జెక్టుల వారీగా ఎగ్జామ్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన TGPSC Group-III 2024.

Join for Update Information
 

TGPSC Group-III Exam 2024 : తెలంగాణలో గ్రూప్‌-3 అభ్యర్థులకు శుభవార్త, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. నవంబర్‌ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించినున్నట్లు వెల్లడించిన పబ్లిక్ కమిషన్‌.. తాజాగా షెడ్యూల్‌ వివరాలు కూడా విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది . అలాగే.. TSPSC Group -3 మోడల్‌ ఆన్సర్‌ బుక్‌లెట్లను తెలంగాణ వెబ్‌సైట్‌ నందు https://websitenew.tspsc.gov.in/ లో ఉంచినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1388 గ్రూప్‌-3 పోస్టులను భర్తీ చేయనున్నారు తెలంగాణ కమిషన్ ఒక్క ప్రకటనలో చెప్పడం జరిగింది.

TGPSC Notification 2024
TGPSC Notification 2024

ఇక వివరాల్లోకెళ్తే.. TGPSC Group – 3 ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొదట 1363 పోస్టులతో 2022 డిసెంబర్ 30వ తేదీన TSPSC Group- 3 నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం అదనంగా మరో 13 పోస్టులు చేరుస్తూ TGPSC మరల ఒక్క ప్రకటన చేసింది. తర్వాత ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులను అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1375కి పెరిగింది. అనంతరం నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తుంచియాన్ తెలంగాణ ప్రభుత్వం . దీంతో మరోసారి 13 పోస్టులు కలపడంతో మొత్తం కొలువుల సంఖ్య 1,388కి పెరిగాయి.

ఈ TSPSC Group- 3 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీలు ప్రకటించిన టీజీపీఎస్సీ కమిషన్‌.. తాజాగా సబ్జెక్టుల వారీగా ఈ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అలాగే.. మోడల్‌ ఆన్సర్‌ బుక్‌లెట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

TGPSC Group-III పరీక్ష నమూనా

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం TGPSC Group-3 పరీక్ష రాత పద్ధతిని కింది విధంగా నిర్వహిస్తారు: తెగిపస్సీ ఎక్సమ్ మొత్తం 3 పేపర్లు- 450 మార్కులు ఉండనుంది .. రెండున్నర గంటల సమయం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది :

టీజీపీఎస్సీ గ్రూప్- 3 పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సిలబస్ ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది టీఎస్‌పీఎస్సీ. గ్రూప్‌-3 పోస్టులకు పోటీపడే అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ TGPSC పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. పరీక్షా పూర్తి అయినా తరువాత ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.

పేపర్ విషయం మార్కులు కాల వ్యవధి
పేపర్ 1 సాధారణ అధ్యయనం (General Studies) 150 మార్కులు 150 నిమిషాలు
పేపర్ 2 తెలంగాణ చరిత్ర, రాష్ట్ర వ్యవస్థ (Telangana History and State System) 150 మార్కులు 150 నిమిషాలు
పేపర్ 3 ఆర్థిక శాస్త్రం (Economics), అభివృద్ధి (Development Issues) 150 మార్కులు 150 నిమిషాలు

మొత్తం మార్కులు:

  • 450 మార్కులు

ప్రధాన అంశాలు:

  • పరీక్ష రాత పద్ధతిలో మొత్తం మూడు పేపర్లను నిర్వహిస్తారు.
  • ప్రతి పేపర్‌కు 150 ప్రశ్నలు ఉండి మొత్తం 450 మార్కులు కేటాయించబడతాయి.
  • ప్రతి పేపర్‌కు 150 నిమిషాల కాల వ్యవధి ఉంటుంది.
  • ప్రశ్నలు బహుళ ఎంపిక (Multiple Choice) రూపంలో ఉంటాయి.