నిరుద్యోగ భృతి 3,000 | Yuva Nestham | Nirudyoga Bruthi Scheme | Nirudyoga Bruthi 3000
AP Nirudyoga Bruthi Scheme Apply 2024 ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగ భృతి అకౌంట్‌లో నెలకు రూ.3వేలు, వెంటనే దరఖాస్తు చేస్కోండి, ముఖ్యమంత్రి యువ నేస్తం / నిరుద్యోగ భృతి పథకం 2024 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి AP ముఖ్యమంత్రి యువ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం AP ప్రభుత్వం yuvanestham.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను విడుదల చేసింది.ఈ పథకం కింద అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందజేస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్కళ్యాణ్ గారు ఇప్పటికే పింఛన్ పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల హామీల అమలుపైనా ఫోకస్ పెట్టారు. తాజాగా మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ మేరుకు దరఖాస్తుల్ని కూడా ఆహ్వానిస్తోంది అని సమాచారం.
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చే పనిలో ఉంది. అయితే ఇక్కడ మాత్రం కండిషన్స్ అప్లై అంటోంది.. అది కూడా వేదవిద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు ఈ పథకాన్ని ముందుగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది . ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దరఖాస్తుల్నిస్వీకరణకు ఆహ్వానించింది దేవాదాయశాఖ. వేదవిద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులు ఈ నిరుద్యోగ భృతిని పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని దేవదాయ శాఖ అధికారులు జిల్లాల్లో సూచించారు.
నిరుద్యోగ భృతి కింద ప్రభుత్వం నెలకు రూ.3,000 ఇవ్వనుందని దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నవాళ్లు.. వేదవిద్య ధ్రువపత్రంతో పాటుగా ఆధార్‌కార్డు, ఏ ఉద్యోగమూ చేయడం లేదని స్వీయ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ పత్రాలతో కూడిన దరఖాస్తును తీసుకుని ఈనెల 26వ తేదీలోగా ఆయా జిల్లాల్లోని దేవాదాయశాఖ కార్యాలయానికి త్వరగా రావాలని సూచించారు. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు అధికారులు. క్రమాంతం ఆపై కోర్సులు చదివిన వేద విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. School Complex Meeting Sept-2024




