Rashtriya Indian Military College Admissions Download 2025 | డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌లో 8తరగతిలో ప్రవేశాలకు APPSC దరఖాస్తులు కోరుతోంది

Rashtriya Indian Military College Admissions

డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌లో 8తరగతిలో ప్రవేశాలకు APPSC దరఖాస్తులు కోరుతోంది, సెప్టెంబరు 30, 2024  వరకు దరఖాస్తుకు స్వీకరణకు అవకాశం కల్పించారు

Rashtriya Indian Military College Admissions ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) జూలై 2025 టర్మ్ కోసం రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (RIMC) ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులను ప్రారంభించినట్లు ప్రకటించింది.  డెహ్రాడూన్‌లోని RIMCలో 8వ తరగతిలోకి అబ్బాయిలు మరియు బాలికలను అడ్మిట్ చేయడానికి ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష డిసెంబర్ 1, 2024న వివిధ రాష్ట్రాల్లోని నిర్దేశిత కేంద్రాలలో నిర్వహించబడుతుంది. సాధు స్వభావం కాని అకడమిక్ మరియు సైనిక శిక్షణకు పేరు పొందిన RIMC, జూలై 1, 2025 నాటికి 11½ నుండి 13 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానిస్తుంది.

Join for Update Information
 

దరఖాస్తుదారులు ప్రస్తుతం 7 తరగతిలో చేరి ఉండాలి లేదా అడ్మిషన్ తేదీ నాటికి గుర్తింపు పొందిన పాఠశాల నుండి ఏడవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అని APPSC సూచించింది. పరీక్షలో గణితం, జనరల్ నాలెడ్జ్ మరియు ఇంగ్లీష్‌తో సహా సబ్జెక్టులు ఉంటాయి, తర్వాత విజయవంతమైన అభ్యర్థుల కోసం వైవా-వాయిస్ ఉంటుంది.డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌లో 8తరగతిలో ప్రవేశాలకు APPSC దరఖాస్తులు కోరుతోంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో 2025 జులై సెషన్‌కు సంబంధించి 8వ తరగతిలో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. స్థానికoగ ఉన్న బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన ఎంపిక అర్హతలున్న విద్యార్థులు సెప్టెంబరు 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 1న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.Rashtriya Indian Military College Admissions 2025

ఆప్లికేషన్ ను ఎలా దరఖాస్తు చేయాలి :

  • క్రమ పద్దతి లో విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించగానే ఆర్‌ఐఎంసీ దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్‌, పాత ప్రశ్నపత్రాలను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపుతారు.
  • విద్యార్థులు దరఖాస్తు ఫారాన్ని నింపి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి ఏపీపీఎస్సీ చిరునామాకు పంపించాలి.
  • దరఖాస్తుతోపాటు అభ్యర్థులు మున్సిపల్‌ కార్పొరేషన్‌/గ్రామ పంచాయతీ జారీ చేసిన
  1. బర్త్‌ సర్టిఫికెట్‌; నివాసం,
  2. కులం ధ్రువీకరణ పత్రాలు,
  3. బోనఫైడ్‌ సర్టిఫికెట్‌,
  4. ఆధార్‌ కార్డ్‌,
  5. విద్యార్థి 2 ఫొటోలు పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు చెల్లించు పద్దతి :

జనరల్‌ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. (లేదా) డిమాండ్ డ్రాఫ్ట్ పంపడం ద్వారా కూడా దరఖాస్తులు పొందవచ్చు.

అభ్యర్థులు…….!   ‘The Commandant RIMC Fund,

  • Drawee Branch,
  • HDFC Bank,
  • Ballapur Chowk,
  • Dehradun, Bank Code 1399,
  • Uttarakhand’ పేరిట డిడి తీయాల్సి ఉంటుంది.
అర్హత: 

Rashtriya Indian Military College Admissions 2025 | 01.07.2025 నాటికి గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఏడోతరగతి ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి లేదా చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:-

ప్రవేశ పరీక్ష,  వైవా వాయిస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక

రాత పరీక్ష విధానం క్లుప్తంగా :-

మొత్తం 400 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహించపడుతుంది .

  • ఇందులో_ ఇంగ్లిష్‌ సబ్జెక్టు నుంచి 125 మార్కులకు,
  • మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్ నుంచి 200 మార్కులకు,
  • జనరల్‌ నాలెడ్జ్‌ సబ్జెక్ట్ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
  • విద్యార్థులు సమాధానాలను హిందీ లేదా ఆంగ్ల మాధ్యమంలో రాయవచ్చు అని తెలిపింది .

ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి ఆకారిగా వైవా వోస్‌ నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. ఇందులో ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితర అంశాలు పరీక్షిస్తారు. ఇందులో కూడా అర్హత సాధించినవారికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు అని పేర్కొన్నారు.

ముఖ్యమైన తేదీలు:-

➥ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30/09/2024.

➥ పరీక్ష తేది: 01/12/2024

పరీక్ష సమయం:-

➥ మ్యాథమెటిక్స్ – ఉ.9.30 గం. – ఉ.11.00 గం. వరకు

➥ జనరల్ నాలెడ్జ్ – మ.12.00 గం.- మ.1.00 గం. వరకు

➥ ఇంగ్లిష్ – మ.2.30 గం.- సా.4:30 గం. వరకు

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి మా తెలుగువిద్యా వెబ్సైట్ ని సందర్శించడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  ➥ ➥ ➥➥➥➥ Click Here